: చనిపోయాడనుకున్న భర్త బతికే ఉన్నాడు!


చనిపోయాడనుకున్న వ్యక్తి బతికున్నాడని తెలిస్తే.. ఆనందానికి అవధులుండవు. సరిగ్గా ఇలాంటి సంఘటన ఒకటి గద్వాల్ లో చోటుచేసుకుంది. ఆలూరుకు చెందిన వెంకటన్న కూలీ పనుల నిమిత్తం హైదరాబాద్ కు వచ్చాడు. ఇక్కడ కొద్ది రోజులు పని చేశాడు. అయితే ఈ విషయం తెలియని ఆయన కుటుంబం సభ్యులు వెంకటన్న తప్పిపోయాడని భావించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఈ సంఘటన జరిగిన మూడు రోజులకే గద్వాల నదీ అగ్రహారం సమీపంలో ఉన్న కృష్ణా నదిలో ఒక శవం కొట్టుకు వచ్చింది. ఆ శవం వెంకటన్నదే అని పోలీసులు తేల్చడంతో ఆయన భార్య లక్ష్మి వితంతువుగా మారింది. గమ్మత్తేమిటంటే, ఆ శవం వెంకటన్నది కాదని ఉలిగేపల్లికి చెందిన కుర్వ గోవిందునిదని తర్వాత తేలింది. దీంతో లక్ష్మి, ఆమె కుటుంబ సభ్యులు అయోమయంలో పడ్డారు. ఇదంతా జరుగుతుండగా వెంకటన్న తాను బతికే ఉన్నానని, హైదరాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. భర్త చనిపోయాడనుకుని వితంతువుగా మారిన లక్ష్మికి వెంకటన్నతో శనివారం మళ్లీ పెళ్లి నిర్వహిస్తున్నారు.

  • Loading...

More Telugu News