: టీచర్లపై నోరు పారేసుకున్న రాంగోపాల్ వర్మ...‘టీచర్స్ డే’పై వివాదాస్పద ట్వీట్స్


బాలీవుడ్ సంచలన దర్శకుడు, వివాదాలకు కేంద్ర బిందువు రాంగోపాల్ వర్మ ఉపాధ్యాయులపైనా నోరు పారేసుకున్నారు. తాజాగా టీచర్స్ డేను పురస్కరించుకుని గురువులపై వివాదాస్పద వ్యాఖ్యలతో ట్విట్టర్లో ప్రత్యక్షమయ్యారు. ‘‘నా జీవితంలో ఏ ఒక్కరికి హ్యాపీ టీచర్స్ డే అని చెప్పను. ఎందుకంటే నేను ఒక్కరోజు కూడా గురువులతో సంతోషంగా లేను. సక్సెస్ ఫుల్ ఇంజినీర్స్, సక్సెస్ ఫుల్ డాక్టర్స్ ఉన్నారు కాని, ఎక్కడైనా సక్సెస్ ఫుల్ టీచర్చ్ ఉన్నారా? కరణ్ జోహార్ ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ తీసినట్లుగా ఎవరైనా ‘టీచర్ ఆప్ ద ఇయర్’ చేస్తే, అది ‘డిజాస్టర్ ఆప్ ద ఇయర్’ అవుతుంది’’ అని వర్మ తన ట్విట్టర్ ఖాతాలో కామెంట్లు చేశారు.

  • Loading...

More Telugu News