: భద్రాద్రి రాముడికి బంగారు తులసీ దళాలతో అర్చన


భద్రాద్రి రాముడికి బంగారు తులసీదళాలతో శనివారం అర్చన చేశారు. శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బంగారు తులసీ దళాలను రామయ్య పాదాలపై ఉంచుతూ అర్చకులు మంత్రాలను పఠించారు. బేడా మండపంలో సీతారామచంద్ర స్వామికి నిర్వహించిన నిత్య కల్యాణాన్ని తనివితీరా చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు జగన్నాథాచార్యులు మాట్లాడుతూ వైష్ణవ సంప్రదాయం ప్రకారం కృష్ణాష్టమి వేడుకలు ఆదివారం నిర్వహిస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News