: రిమ్స్ ఆవరణలో ఆయుష్ ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రి జోగు రామన్న


ఆదిలాబాద్ లోని రిమ్స్ ప్రాంగణంలో ఆయుష్ ఆసుపత్రిని రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగు రామన్న శనివారం నాడు ప్రారంభించారు. తొలుత ఇదే ప్రాంగణంలో రూ. 2.83 కోట్లతో నిర్మించనున్న క్యాంటీన్ కు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో జిల్లాలోని అన్ని ఆసుపత్రులలో సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. రిమ్స్ లో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని పేర్కొన్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో వ్యాధులు తగ్గుముఖం పట్టాయని మంత్రి అన్నారు.

  • Loading...

More Telugu News