: లండన్ పర్యటనకు ఏపీ స్పీకర్... మంత్రి బొజ్జల కూడా!
ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ నేడు లండన్ పర్యటనకు బయలుదేరుతున్నారు. పది మంది ప్రతినిధి బృందంతో కలిసి బ్రిటన్ రాజధాని వెళ్లనున్న కోడెల ‘వాతావరణ మార్పులు, పర్యావరణ పరిరక్షణ’ అనే అంశంపై జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. ఆరు రోజుల పర్యటన తర్వాత స్పీకర్ తిరిగి వస్తారు. బ్రిటన్ ఇంధన, వాతావరణ మార్పుల శాఖ, యూకే కార్బన్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశానికి హాజరు కావాలని కోడెలకు బ్రిటన్ హై కమిషన్ నుంచి ఆహ్వానం అందింది. కోడెల బృందంలో ఏపీ అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, అసెంబ్లీ ఇన్ చార్జీ కార్యదర్శి సత్యనారాయణతో పాటు ఎనిమిది మంది ఎంపీలున్నారు.