: సచివాలయంలో ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం


ఏపీ సచివాలయంలో కేబినెట్ భేటీ ప్రారంభమైంది. దాదాపు మూడు నెలల తరువాత హైదరాబాద్ లో భేటీ జరుగుతోంది. రైతుల రుణమాఫీ విజయయాత్రలు, నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం, గత సమావేశంలోని పెండింగ్ అంశాలు, శాసనసభ సమావేశాలు జరిగిన తీరు, మచిలీపట్నం రేవుకు భూసమీకరణ, విజయవాడకు వివిధ శాఖల కార్యాలయాల తరలింపు, నిత్యావసరాల ధరల పెరుగుదల, రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులపై చర్చించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశానికి ఏపీ మంత్రులందరూ హాజరయ్యారు.

  • Loading...

More Telugu News