: బాలీవుడ్ సంగీత దర్శకుడు శ్రీవాత్సవ కన్నుమూత
కేన్సర్ వ్యాధితో చికిత్స పొందుతున్న బాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు ఆదేశ్ శ్రీవాత్సవ (50) కన్నుమూశారు. గత కొంతకాలంగా ముంబయిలోని కోకిల బెన్ అంబానీ ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న ఆయన అర్ధరాత్రి సమయంలో మృతి చెందారు. శ్రీవాత్సవకు భార్య విజేత పండిట్, కుమారులు అన్వేష్, అవితేష్ ఉన్నారు. ఆయన మృతికి సినిమా రంగ ప్రముఖులతోపాటు ఇతర రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. కాగా, శ్రీ వాత్సవ 100కు పైగా బాలీవుడ్ చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. 'రాజ్ నీతి', 'చల్తే చల్తే' వంటి హిట్ చిత్రాలు ఆయన ఖాతాలో ఉన్నాయి.