: ఏం బాలరాజు... పనులెట్టా సాగుతున్నాయి?: గులాబీ నేతకు కేసీఆర్ పలకరింపు
గులాబీ దళపతి, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిన్న తన పార్టీకి చెందిన గ్రామస్థాయి నేతను పలకరించారు. ఈ నెల 8న చైనా పర్యటనకు వెళుతున్న క్రమంలో ఓ సారి తన సొంత వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి వద్దామనుకున్న కేసీఆర్ నిన్న మెదక్ జిల్లా జగదేవ్ పూర్ మండలం ఎర్రవలిలోని తన ఫామ్ హౌస్ కు వెళ్లారు. ఈ సందర్భంగా ఫామ్ హౌస్ సమీపంలో తన కోసం వేచి చూస్తున్న ఎర్రవలి సర్పంచ్ భర్త, టీఆర్ఎస్ నాయకుడు బాలరాజును పలకించారు. ‘‘ఏం బాలరాజు.. అంతా సెట్ రైట్ అయ్యిందా? పనులెట్టా సాగుతున్నాయి?’’ అని బాలరాజును కేసీఆర్ పలకరించారు. నేడు ఫామ్ హౌస్ లోనే ఉండే కేసీఆర్, ఆదివారం ఉదయం హైదరాబాదుకు వెళ్లనున్నారు.