: చిన్నారి అత్యాచారం కేసులో మూడో వాడూ ఉన్నాడా !?


దేశ రాజధానిలో ఐదేళ్ల బాలికపై అత్యాచార ఘటనలో పలు ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. చిన్నారిని ఒక్కరు కాదు, ఇద్దరు అత్యాచారం చేసినట్లు తెలియడంతో మొదటి నిందితుడు మనోజ్ ను విచారిస్తే తాను అత్యాచారానికి పాల్పడలేదని, ప్రదీప్ కే సంబంధం ఉందని వివరించాడు. దాంతో పోలీసులు నిన్న రెండో వ్యక్తి ప్రదీప్ ని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం అతడిని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారించినప్పుడు కొన్ని విషయాలు చెప్పాడు.

15వ తేదీ సాయంత్రం తాము తూర్పు ఢిల్లీ గాంధీనగర్ లో ఓ గది అద్దెకు తీసుకున్నామన్నాడు. అప్పుడు ఓ వ్యభిచారిని తెచ్చుకోవాలని అనుకున్నామని అయితే తక్కువ డబ్బు ఉండడంతో ఆ పని చేయలేదని తెలిపాడు. అప్పుడే దగ్గర్లో ఆడుకుంటున్న చిన్నారి 'గుడియా'ను చూసి చాక్లెట్ ఇచ్చి గదికి తీసుకొచ్చి ఈ దారుణానికి పాల్పడినట్లు వివరించాడు. తాగిన మైకంలో పెద్ద తప్పు చేశానని నిందితుడు ఒప్పుకున్నట్లు కేసును విచారిస్తున్న పోలీసులు వెల్లడించారు. అంటే దీని ప్రకారం ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి ఒడిగట్టినట్లు స్పష్టంగా తెలుస్తోంది. మొదటి నిందితుడు తాను కాదు అన్నాడు. రెండోవాడు తానేనని ఒప్పుకున్నాడు. మరి ఆ మూడో నిందితుడు ఎవరు ? మనోజ్ చెప్పింది వాస్తవమేనా? లేక మూడో వ్యక్తి కూడా ఇందులో పాలుపంచుకున్నాడా? అని పోలీసులు మరింత దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News