: రహానేను ఆ స్థానంలో దించడం సముచితం కాదు: ద్రవిడ్


టీమిండియాలో నిలకడ ప్రదర్శించే అజింక్యా రహానేను టెస్టుల్లో వన్ డౌన్ లో బ్యాటింగ్ కు పంపడం సరైన నిర్ణయమని భావించడం లేదని గ్రేట్ వాల్ రాహుల్ ద్రవిడ్ తెలిపాడు. బెంగళూరులో ఆయన మాట్లాడుతూ, రహానేను 5వ నెంబర్ లో బ్యాటింగ్ కు పంపితే అత్యుత్తమ ఫలితాలు సాధించవచ్చని అన్నాడు. 5 కాదంటే 4వ స్థానంలో పంపినా ఉపయోగం ఉంటుందని ద్రవిడ్ అభిప్రాయపడ్డాడు. రహానేను టెస్టులో ఆ స్థానంలో బ్యాటింగ్ కు పంపడం వల్ల టెయిలెండర్లతో మంచి స్కోరు రాబట్టవచ్చని అన్నాడు. అప్పటికి రెండో కొత్త బంతిని బౌలర్లు తీసుకునే అవకాశం ఉండడంతో రహానే అయితే సమర్థవంతంగా ఎదుర్కొంటాడని ద్రవిడ్ తెలిపాడు.

  • Loading...

More Telugu News