: చెన్నైనుంచి వైష్ణోదేవి ఆలయానికి రైలు: రైల్వే మంత్రి సురేష్ ప్రభు


ప్రముఖ పుణ్యక్షేత్రం వైష్ణోదేవీ ఆలయానికి చెన్నైనుంచి రైలు సదుపాయం కల్పిస్తున్నట్టు రైల్వే మంత్రి సురేష్ ప్రభు వెల్లడించారు. చెన్నై సెంట్రల్ .. జమ్ముతావి అండమాన్ ఎక్స్ ప్రెస్ కత్రా స్టేషన్ వరకు వెళ్తుందని మంత్రి తెలిపారు. వారంలో మూడు రోజుల పాటు ఈ రైలు సదుపాయం ఉంటుందని ఆయన వివరించారు. దేశంలోని అన్ని పుణ్యక్షేత్రాలకు రైలు సౌకర్యం కల్పించేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. వైష్ణోదేవీ ఆలయానికి దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశీ భక్తులు కూడా దర్శన నిమిత్తం వస్తుంటారు. రైలు సదుపాయం కల్పించడంలో ప్రయాణం మరింత సులభతరమై సందర్శించే భక్తుల సంఖ్య పెరిగే అవకాశాలుండవచ్చని అధికారులు అంటున్నారు.

  • Loading...

More Telugu News