: ప్రపంచాన్ని విషాదంలో ముంచెత్తిన చిన్నారి ఫోటో 4.5 కోట్ల రూపాయలు పోగేసింది!
ఆటలాడుకుని అలసిపోయి సముద్రుడి చెంత సేదదీరుతున్నట్టు కనిపించిన మూడేళ్ల సిరియా బాలుడు అయలాన్ కుర్దీ విషాదగాథా చిత్రం ప్రతి ఒక్కర్నీ కన్నీరు పెట్టించింది. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరినీ కదిలేలా చేసిన అయలాన్ కుర్దీ రెండు రోజుల్లో పది వేల మందిని చలించిపోయేలా చేశాడు. బాలుడి ఫోటో చూసి ఏదో ఒకటి చేయకపోతే మనుషులమే కాదని భావించిన పది వేల మంది 'ద ఛారిటీ మైగ్రెంట్ ఆఫ్ షోర్ ఎయిడ్ స్టేషన్'కు విరాళాలు పంపారు. ఇలా కేవలం రెండు రోజుల్లోనే పంపిన విరాళాల మొత్తం 4.5 కోట్ల రూపాయలకు చేరిందని ఛారిటీ నిర్వాహకులు వెల్లడించారు. అమెరికా, బ్రిటన్, బ్రెజిల్, జర్మనీ, టర్కీ తదితర దేశాల పౌరులు ఈ విరాళాలు అందించినట్టు వారు తెలిపారు. సిరియా అంతర్యుద్ధం నుంచి తప్పించుకునేందుకు చిన్న చిన్న బోట్లలో దేశం దాటేందుకు ప్రయత్నించి సఫలమవుతున్న వారిని ఈ సంస్థ ఆదుకుంటోంది.