: షఫీ గాథకు చలించిపోయిన హరీష్ రావు... మార్కెట్ యార్డులో ఉద్యోగ నియామకం!


భుజాన భార్య శవం, చేతిలో పసిగుడ్డు...భవిష్యత్ గాఢాంధకారం... అంత్యక్రియలు నిర్వహించాలి...చేతిలో చిల్లిగవ్వలేదు...పాలమూరు బస్టాండ్ లో చిన్నపిల్లాడిలా ఏడుస్తున్న షఫీని ఆర్టీసీ ఉద్యోగులు ఆదుకున్న వైనం నయనాలనూ తడి చేసింది. ఈ గాథ తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావును చలించిపోయేలా చేసింది. షఫి గాథ విన్న ఆయన కదిలిపోయారు. ఇప్పుడతను ఎలా బ్రతుకుతాడు? అంటూ ఆలోచించారు. మరుక్షణం హైదరాబాదు, మార్కెట్ యార్డులోని అవుట్ సోర్సింగ్ కార్మికుడిగా అతనికి ఉద్యోగం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. జీవితంపై ఆశపెంచుకోవాలని, పిల్లలను చక్కగా చూసుకుని, బాగా చదివించాలని అతనికి సూచించారు. కాగా, కాటేదాన్ లో లారీ క్లీనర్ గా పని చేసుకుంటున్న షఫి భార్య పండంటి పాపకు జన్మనిచ్చి మరణించగా, అతని భార్యను అష్టకష్టాలు పడి, చివరికి ఆర్టీసీ కార్మికుల సాయంతో స్వగ్రామానికి తీసుకెళ్లిన వైనం పత్రికల్లో ప్రసారం కావడంతో ఈ సంఘటన వెలుగు చూసింది.

  • Loading...

More Telugu News