: మోదీ, బాబు, వెంకయ్యలపై కేసు పెడతా: దేవినేని నెహ్రూ


ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదాపై మాటతప్పిన ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడిపై పోలీస్ కేసులు పెడతామని పీసీసీ ఉపాధ్యక్షుడు దేవినేని నెహ్రూ తెలిపారు. ఈ రోజు విజయవాడ నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 7, 8 తేదీలలో ఈ ముగ్గురిపై రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలోను ఫిర్యాదు చేస్తామని నెహ్రూ చెప్పారు. కాగా, టీడీపీ అవినీతి పాలనపై ఆయన విమర్శలు గుప్పించారు. ఓటుకు నోటు వ్యవహారంపై శాసనసభలో వైఎస్సార్ కాంగ్రెస్ వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి చంద్రబాబు భయపడ్డారని, అందుకే సభకు హాజరు కాలేదని నెహ్రూ ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News