: 'వీలర్ ఐలాండ్'కు కలామ్ పేరు
మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్ కలామ్ గౌరవార్థం ఒడిశాలోని వీలర్ ఐలాండ్ కు ఆయన పేరును పెట్టినట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఒడిశా రాజధాని భువనేశ్వర్ కు 150 కిలోమీటర్ల దూరంలో వీలర్ ఐలాండ్ ఉంది. సముద్ర తీర ప్రాంతంలో ఉన్న ఈ ఐలాండ్.. మన దేశానికి చెందిన మిస్సైళ్ల పరీక్షా కేంద్రంగా ఉంది. భారతదేశంలో ఉన్న కీలక సదుపాయాలు ఉన్న మిస్సైల్ టెస్టింగ్ కేంద్రాలలో ఇది కూడా ఒకటి. ప్రజల రాష్ట్రపతిగా, మిస్సైల్ మ్యాన్ గా పేరు పొందిన కలామ్ పేరును వీలర్ ఐలాండ్ కు పెట్టడం ద్వారా ఆయనకు నిజమైన నివాళులర్పించినట్టు అవుతుంది.