: దొరికిందేంటా? అని పరిశీలిస్తూ మృత్యువాతపడ్డ బాలుడు!
జమ్మూకాశ్మీర్ సరిహద్దుల్లో మరణ మృదంగం నిరంతరాయంగా మోగుతూనే ఉంది. బారాముల్లా జిల్లాలోని లదోరా ప్రాంతంలో సైనికులు, తీవ్రవాదుల మధ్య నేటి ఉదయం కాల్పులు జరిగాయి. ఓ ఇంట్లో తలదాచుకున్న తీవ్రవాదిని సైనికులు మట్టుబెట్టారు. ఈ క్రమంలో ఓ సైనికుడు అసువులుబాసాడు. అయితే తీవ్రవాది మరణించిన ఇంటికి సమీపంలోంచి వెళ్తున్న జునైద్ తన్వీర్ దార్ అనే బాలుడికి గుండ్రంగా ఓ వస్తువు దొరికింది. ఆసక్తితో దానిని వెంట తీసుకెళ్లిన జునైద్ అదేంటా? అని పరిశీలించే క్రమంలో పేలుడు సంభవించింది. దీంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా మృత్యువాత పడ్డాడు. జునైద్ కు దొరికింది గ్రనేడ్ అని పోలీసులు తెలిపారు. ఉగ్రవాదుల దుశ్చర్య కారణంగా అన్నెంపున్నెం ఎరుగని బాలుడు మృత్యువాత పడడం అక్కడి వారిని కలచివేసింది.