: 'బిగ్ బాస్' షోకి వ్యాఖ్యాతగా సల్మాన్ ఖాన్ ఖరారు


బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖానే ఈ ఏడాది కూడా బిగ్ బాస్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారని కలర్స్ టీవీ ఛానెల్ ప్రతినిధులు ప్రకటించారు. గతంలో నాలుగు సీజన్లకు సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. గత సీజన్ లో వంద కోట్ల పారితోషికం తీసుకున్న సల్మాన్ ఖాన్ ఈసారి ఎంత పారితోషికం తీసుకున్నారో వెల్లడించనప్పటికీ, బిగ్ బాస్ సీజన్ 9 రియాలిటీ షో వ్యాఖ్యాతగా భాయ్ వ్యవహించనున్నట్టు కలర్స్ ప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు ప్రోమో షూటింగ్ లో కూడా పాల్గొన్నాడని కలర్స్ ప్రతినిధులు వెల్లడించారు. గత సీజన్ చివరిలో సల్మాన్ వ్యాఖ్యాన బాధ్యతలు కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ కు అప్పగించారు. దీంతో రేటింగ్ లో బిగ్ బాస్ కాస్త వెనకబడింది. మరోసారి సల్మాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడని ఛానెల్ ప్రకటించడంతో ఈ షోపై అభిమానులు ఆసక్తి చూపుతున్నారు.

  • Loading...

More Telugu News