: తెలంగాణ అర్చకుల సమ్మె విరమణ


తెలంగాణ దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల అర్చకులు, ఉద్యోగులు సమ్మెను విరమించారు. ట్రెజరీ ద్వారా తమకు జీతాలు చెల్లించాలని, మరికొన్ని డిమాండ్లతో వారు సమ్మెకు దిగారు. ఇదే విషయమై గత జూన్ లో అర్చకులు, ఉద్యోగుల డిమాండ్ల పరిశీలనకు తెలంగాణ సర్కారు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. నెలరోజుల్లోగా నివేదిక ఇవ్వాల్సిన కమిటీ ఎంతకూ ఇవ్వకపోవడంతో వారు మళ్లీ సమ్మెకు దిగారు. దీంతో ఉద్యోగుల జేఏసీ మళ్లీ సమ్మెకు దిగడంతో ప్రభుత్వం స్పందించింది. వారి డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని, ఇబ్బంది పెట్టే ఆలోచన తమకు లేదని టీ ప్రభుత్వం అంటోంది.

  • Loading...

More Telugu News