: అక్టోబర్ రెండో వారంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు?
ప్రధాని మోదీ, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ లకు అత్యంత ప్రతిష్టాత్మకమైన బీహార్ అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్ రెండో వారంలో జరిగే అవకాశం ఉంది. వచ్చే వారం దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వెలువడనుందని సమాచారం. మొత్తం ఐదు దశల్లో ఎన్నికలు జరగనున్నాయని తెలుస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘంతో కేంద్ర హోం శాఖ జరిపిన చర్చల్లో ఎన్నికల తేదీలపై చర్చించినట్టు సమాచారం. బీహార్ లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఉండటంతో ఐదు విడతలుగా ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.