: ములాయంను బుజ్జగిస్తున్న లాలూ, శరద్... కూటమిలోకి తిరిగి తీసుకొచ్చే దిశగా మంతనాలు


జనతాపరివార్ మహాకూటమి నుంచి బయటికొచ్చి బీహార్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని సమాజ్ వాదీ పార్టీ తీసుకున్న నిర్ణయంతో మిగతా పార్టీలు కంగుతిన్నాయి. దాంతో దిద్దుబాటు చర్యలు చేపట్టిన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన వెంట శరద్ యాదవ్ లు ఎస్పీ అధినేత ములాయం సింగ్ ను ఢిల్లీలోని ఆయన ఇంట్లో బుజ్జగిస్తున్నారని తెలిసింది. నిన్న శరద్ యాదవ్ కలసిన సమయంలో.. తాను కలత చెందానని, తనను సంప్రదించకుండా అవమానించారని ములాయం అన్నట్టు సమాచారం. దాంతో ఎలాగైనా ములాయంను దారిలోకి తెచ్చుకోవాలని, లేకుంటే ఎన్నికల్లో ఓట్లు చీలి బీజేపీకి ప్రయోజనం కలిగే అవకాశం ఉందని ఆందోళన పడుతున్నారు. ఈ క్రమంలో లాలూ, శరద్ యాదవ్ లు ములాయంను ఒప్పిస్తారా? లేదా? అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది. ఇటీవల మహాకూటమిలోని పార్టీలు సీట్ల సర్దుబాటు చేసుకున్నాయి. ఎస్పీకి కేవలం 5 సీట్లు కేటాయించాయి. అది కూడా తనను సంప్రదించకుండా చేశారంటున్న ఎస్పీ.. జనతాపరివార్ నుంచి బయటకు వచ్చినట్టు నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News