: అవకాశమొస్తే హాలీవుడ్ లో నటిస్తా: 'మాంఝీ' చిత్ర కథానాయకుడు
అవకాశమొస్తే హాలీవుడ్ లో నటిస్తానంటున్నాడు 'మాంఝీ' చిత్ర కథానాయకుడు నవాజుద్దీన్ సిద్దిఖి. మాంఝీ చిత్రంతో పూర్తి స్థాయి కథానాయకుడిగా సిద్దిఖి పేరు సంపాదించుకున్నాడు. 'గాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్' అనే బాలీవుడ్ చిత్రంతో వెండితెరకు ఆయన పరిచయమయ్యారు. కిక్, కహాని, భజరంగీ భాయ్ జాన్ చిత్రాలలో నటించి తన నటనా ప్రతిభను కనబరిచి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. అయితే, ఈ సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే, మాంఝీ చిత్రం మరో ఎత్తు. మాంఝీ చిత్రంలోని తన నటనతో ప్రేక్షకుల అభిమానం సిద్దిఖి సొంతమైంది. హాలీవుడ్ లో నటిస్తారా? అంటూ విజయబాటలో కొనసాగుతున్న సిద్దిఖీని విలేకరులు ప్రశ్నించగా... అవకాశమొస్తే వదిలేది లేదని ఆయన సమాధానమిచ్చారు.