: సిక్కు మతస్థుడిని తలపాగా తీయమన్న సెక్యూరిటీ గార్డు


సెక్యూరిటీ చెకింగ్ నిమిత్తం తలపాగా తీయమంటూ ఓ సిక్కు మతస్థుడిని అడ్డుకున్న సంఘటన చెన్నై మెట్రో రైల్వేస్టేషన్ లో ఇటీవల జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా బాధితుడే సోషల్ మీడియాలో తన మిత్రులతో షేర్ చేసుకున్నాడు. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే... తన్ దీవ్ సింగ్ అనే యువకుడు మెట్రో రైల్వేస్టేషన్ కు వెళ్లాడు. చెకింగ్ అయిపోయిన అనంతరం లోపలికి వెళుతుండగా, అక్కడే ఉన్న ఓ సెక్యూరిటీ గార్డు తలపాగా తీసి చెక్ చేయాలన్నాడు. అది కుదరదని, కావాలంటే తన తలపాగాపై చేతులు పెట్టి చూడాలని అతను కోరాడు. అందుకు సెక్యూరిటీ గార్డు ససేమిరా అన్నాడు. దీంతో ఆగ్రహించిన తన్ దీవ్ సింగ్, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం సదరు సెక్యూరిటీ గార్డు తనకు క్షమాపణలు చెప్పాడని సిక్కు యువకుడు తన మిత్రులకు తెలిపాడు.

  • Loading...

More Telugu News