: ప్రియురాలిని లారీ కిందకు తోసేసిన ప్రియుడు!


తన ప్రియురాలి భుజంపై చేతులు వేసి మాట్లాడుతూ రోడ్డుపై నడిపించుకుని తీసుకెళ్తున్న ప్రియుడు ఉన్నట్టుండి ఆమెను వేగంగా వస్తున్న లారీ కిందకు తోసి పరారయ్యాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా ఇల్లెందులో జరుగగా, లారీ డ్రైవర్ దూరం నుంచి ఈ విషయం గమనించి, వాహనాన్ని పక్కకు మళ్లించడంతో యువతి ప్రాణాలు దక్కాయి. తీవ్రగాయాలైన ఆమెను స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె అపస్మారక స్థితిలో ఉన్నందున, ఘటన వెనక అసలు కథ తెలియడం లేదని పోలీసులు తెలిపారు. కాగా, యువతీ యువకుల పేర్లు శేఖర్, సంధ్య కాగా, వీరిద్దరికీ కాలేజీ రోజుల నుంచి పరిచయం ఉందని తెలుస్తోంది. రోడ్డుపై నడుస్తున్న సమయంలో వీరిద్దరి మధ్యా వాగ్వాదం జరిగిందని ఘటనను చూసిన కొందరు స్థానికులు వెల్లడించారు. శేఖర్ పారిపోగా, కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News