: తొలి లక్ష అందుకోండి...మరో 14 లక్షల డీఎన్ఏలు ఉన్నాయి: ప్రధానికి నితీష్ కుమార్


లక్ష డీఎన్ఏ నమూనాలను ప్రధాని నరేంద్ర మోదీ నివాసానికి పంపినట్టు జేడీయూ తెలిపింది. శబ్ద్ వాపసీ కార్యక్రమంలో భాగంగా బీహార్ వ్యాప్తంగా ప్రజల నుంచి సేకరించిన లక్ష డీఎన్ఏ నమూనాలను ప్రధాని నివాసానికి పంపినట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. బీహారీల నుంచి 15 లక్షల డీఎన్ఏలను సేకరించామని, తొలి విడతగా అందులో లక్ష డీఎన్ఏలను పంపుతున్నామని, మిగిలిన డీఎన్ఏలను కూడా పంపుతామని ఆయన స్పష్టం చేశారు. బీహార్ లో జరిగిన ఓ బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ, నితీష్ కుమార్ డీఎన్ఏలోనే ఏదో లోపముందని పేర్కొన్నారు. దీనిపై ఆగ్రహించిన నితీష్ కుమార్ బీహారీల డీఎన్ఏలో ఎలాంటి లోపము లేదని, ప్రధాని వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని, కావాలంటే డీఏన్ఏ నమూనాలు సేకరించి పంపుతాము, పరీక్షించుకోవాలని ఆయన సూచించారు. అందులో భాగంగా ఆయన లక్ష డీఎన్ఏ నమూనాలు సేకరించి పంపించారు.

  • Loading...

More Telugu News