: డిగ్రీ పూర్తి చేసిన వీనస్ విలియమ్స్


అమెరికా టెన్నిస్ స్టార్ క్రీడాకారిణి వీనస్ విలియమ్స్ డిగ్రీ పూర్తి చేసింది. ఇటీవల ఇండియానా విశ్వవిద్యాలయం నుంచి ఆమె డిగ్రీ పట్టా కూడా అందుకుంది. దానికి సంబంధించిన ఫోటోను వీనస్ సోదరి సెరెనా విలియమ్స్ ట్విట్టర్ లో పోస్టు చేసింది. ఈ సందర్భంగా తన అక్క వీనస్ ను పోగడ్తలతో ముంచెత్తింది. "నిరంతరం నువ్వు నాకు ఎందుకు స్పూర్తి నిస్తున్నావో 10వేల కారణాలు చెప్పగలను" అని సెరెనా ట్వీట్ చేసింది. డిగ్రీ పూర్తి చేసిన సందర్భంగా పలువురు స్నేహితులు వీనస్ కు శుభాకాంక్షలు తెలిపారు.

  • Loading...

More Telugu News