: విదర్భ తరువాత రైతు ఆత్మహత్యలు తెలంగాణలోనే ఎక్కువ!: కోదండరాం


తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకీ రైతుల ఆత్మహత్యలు పెరగడంపై టి.జేఏసీ ఛైర్మన్, ప్రొఫెసర్ కోదండరాం స్పందించారు. తెలంగాణ రైతులను రుణ విముక్తుల్ని చేయాలని కోరారు. ఆత్మహత్యలను ఆపాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. అంతేగాక తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియో ఇవ్వాలని సూచించారు. భారతదేశంలో విదర్భ తరువాత తెలంగాణలోనే రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నాయని కోదండరాం చెప్పారు.

  • Loading...

More Telugu News