: వాట్స్ యాప్ తెగ వాడుతున్నారు!
సామాజిక మాధ్యమాల్లో వాట్స్ యాప్ హవా బ్రహ్మాండంగా నడుస్తోందని ఆ సంస్థ సీఈవో జాన్ కోమ్ తెలిపారు. వాట్స్ యాప్ ను ఫేస్ బుక్ కొనుగోలు చేసిన తరువాత దాని హవా మరింత పెరిగిందని ఆయన చెప్పారు. ఇతర యాప్ ల కంటే వాట్స్ యాప్ కే అత్యంత ఆదరణ లభిస్తోందని ఆయన పేర్కొన్నారు. సుమారు 90 కోట్ల మంది ప్రజలు దానిని వినియోగిస్తున్నారంటే వాట్స్ యాప్ కున్న ఆదరణను అంచనా వేయవచ్చు. గత ఐదు నెలల కాలంలోనే పది కోట్ల మంది యాక్టివ్ యూజర్లుగా మారారని ఆయన తెలిపారు. గత ఏప్రిల్ నాటికి తమ యాక్టివ్ యూజర్ల సంఖ్య 80 కోట్లపైమాటేనని ఆయన చెప్పారు. గూగుల్ హ్యాంగౌట్స్, వి చాట్, లైన్ వంటి వాటి పోటీని ఎదుర్కొంటూ కూడా వాట్స్ యాప్ అంత్యంత ఆదరణ పొందుతోందని ఆయన పేర్కొన్నారు.