: విద్యార్థులకు జ్ఞానం, విలువలు అందించడానికి ఉపాధ్యాయులు పునరంకితం కావాలి: కేసీఆర్


తెలంగాణ రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి కేసీఆర్ గురుపూజోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల్లో ఉన్న సామర్థ్యాన్ని గుర్తించి, దాన్ని వెలికి తీయాల్సిన గొప్ప బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని ఆయన అన్నారు. విద్యార్థులను సమాజానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దడం ఉపాధ్యాయుల బాధ్యత అని చెప్పారు. జ్ఞానాన్ని, విలువలను విద్యార్థులకు అందించడానికి ఉపాధ్యాయులంతా పునరంకితం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం సందర్భంగా గురుపూజోత్సవం (టీచర్స్ డే) జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News