: టర్కీ తీరానికి కొట్టుకొచ్చిన బాలుడి ఘటనపై ఐరాస హైకమీషనర్ స్పందన


సిరియాకు చెందిన ఐలన్ కుర్ధీ అనే ఓ బాల శరణార్ధి టర్కీ తీరానికి కొట్టుకొచ్చిన ఘటన హృదయ విదారకం అంటూ ఐక్యరాజ్య సమితి శరణార్దుల కమీషనర్ ఆంటోనియో గుటెర్రెస్ అన్నారు. వలసల సంక్షోభాన్ని పరిష్కరించడానికి అరకొర చర్యలతో సరి పెట్టొద్దని సూచించారు. ఒంటరిగా ఏ ఒక్క దేశం కూడా ఈ సమస్యను పరిష్కరించలేదని, అలాగని ఏ ఒక్క దేశం కూడా బాధ్యతల నుంచి తప్పించుకోకూడదని చెప్పారు. ఈ నేపథ్యంలో శరణార్ధుల పునరావాసానికి హై కమీషనర్ పిలుపునిచ్చారు. 2 లక్షల మంది శరణార్ధులను ఐరోపా దేశాలు పంచుకోవాలని ఓ ప్రకటనలో కోరారు. మధ్య ప్రాచ్యం, ఆఫ్రికా నుంచి ఐరోపాకు వలసదారులు, శరణార్థులు ఒక్కసారిగా రావడంతో ఐరోపా ప్రభుత్వాలు ప్రస్తుతం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.

  • Loading...

More Telugu News