: యూఎస్ గ్రాండ్ శ్లామ్ ఆటగాళ్లకు ఎండ దెబ్బ
ఎండల దెబ్బకు యూఎస్ గ్రాండ్ శ్లామ్ ఆటగాళ్లకు దిమ్మతిరుగుతోంది. ఎండ వేడిమి భరించలేక మ్యాచ్ లు జరుగుతుండగానే కళ్లు తిరిగి కిందపడిపోతున్నారు. అమెరికా ఆటగాడు జాక్ సాక్ టెన్నిస్ కోర్టులోనే పడిపోయాడు. స్వదేశీ ఆటగాడే అక్కడి ఎండ వేడిమిని తట్టుకోలేకపోయాడంటే, ఇక విదేశీ ఆటగాళ్ల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో చెప్పనక్కర్లేదు! సుమారు 33 డిగ్రీల ఉష్ణోగ్రత కంటే తక్కువ నమోదవట్లేదు. ఎండ తీవ్రతకు తట్టుకోలేక ఇప్పటివరకు 14 మంది ఆటగాళ్లు పడిపోయారు. సెట్ విరామ సమయాల్లో ఎండ దెబ్బకు గురైన ఆటగాళ్లకు ఉపశమన చర్యలు చేసినా ఫలితము లేని పరిస్థితి. ఉజ్బెకిస్తాన్ క్రీడాకారుడు మ్యాచ్ మధ్యలో కుప్పకూలిపోగా, ఇద్దరు మహిళా క్రీడాకారిణులు తొలి రౌండ్ లోనే పక్కకు తప్పుకున్నారు.