: ప్రత్యేక హోదా కోసం మరొకరి ఆత్మహత్య
ప్రత్యేక హోదా రాకపోతే రాష్ట్రం ఏమైపోతుందో అన్న భయాందోళనలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా నెల్లూరు జిల్లా గూడూరు మండలం చెన్నూరు గ్రామానికి చెందిన రమణయ్య అనే వ్యక్తి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. 40 ఏళ్ల వయసున్న రమణయ్య గూడూరులోని ఒక ఇంజినీరింగ్ కాలేజ్ లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదన్న ఆందోళనతోనే రమణయ్య ఆత్మహత్యకు పాల్పడ్డాడని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.