: రూ. 7 వేల కన్నా తక్కువ ధరలో లభించే 5 హాట్ స్మార్ట్ ఫోన్లు
ఇది స్మార్ట్ ఫోన్ల యుగం. అందుబాటు ధరల్లో మంచి ఫీచర్లున్న ఫోన్లను కొనుగోలు చేయాలని అత్యధికులు భావిస్తుంటారు. ఈ నేపథ్యంలో రూ. 7 వేల కన్నా తక్కువ ధరలో లభించే ఐదు స్మార్ట్ ఫోన్ల వివరాలివి. రెడ్ మీ 2 ప్రైమ్: పూర్తి లామినేటెడ్ తో 4.7 అంగుళాల టచ్ స్క్రీన్ తో లభించే ఈ ఫోన్ లో 3డీ గేమ్ లను ఆడుకునే సౌకర్యం ఉండటం అదనపు ఆకర్షణ. ఒకేసారి పలు రకాల యాప్స్ వాడుకునే వీలుంటుంది. పూర్తి హెచ్ డీ వీడియోలను ప్లే చేస్తుందని ఈ ఫోన్ ను విడుదల చేసిన జియోమీ వెల్లడిస్తోంది. 16 గిగాబైట్ల ఇంటర్నల్ స్టోరేజీతో మార్కెట్లో అందుబాటులో ఉంది. ఫికామ్ ఎనర్జీ 653: స్లిమ్ ప్రొఫైల్, పూర్తి రోజంతా బ్యాటరీ నిలిచి వుండటంతో పాటు మంచి ఆడియో అవుట్ పుట్ ఈ ఫోన్ ను వినూత్నంగా నిలిపాయి. డాక్యుమెంట్లను ఎడిటింగ్ చేసుకునే సదుపాయం కూడా ఉంది. 4జీ సౌకర్యం కూడా ఉన్న ఫోన్లో కెమెరా అంత సంతృప్తికరంగా లేదని వాడిన వారు చెబుతున్నారు. కార్బన్ టైటానియం మాక్ ఫైవ్: చేతులకు మంచి గ్రిప్ ను ఇచ్చేలా బ్యాక్ ప్యానల్ తో పాటు బ్రైట్ కలర్స్, ఇతర ఫోన్లతో పోలిస్తే వెడల్పాటి స్క్రీన్ ఈ స్మార్ట్ ఫోన్ లో ఉన్నాయి. లారా క్రాఫ్ట్ వంటి గేమ్స్ ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆడుకోవచ్చు. హంగామా ప్లే, హాట్ స్టార్, మైంత్రా, ఓఎల్ఎక్స్ వంటి యాప్స్ ప్రీలోడెడ్ గా లభిస్తాయి. అన్నట్టు ఈ ఫోన్ నుంచి మీ టీవీ, కేబుల్ సెట్ టాప్ బాక్స్ లను నియంత్రించుకోవచ్చు. అంటే, రిమోట్ గా కూడా ఉపయోగపడుతుందన్నమాట. మైక్రోమ్యాక్స్ కాన్వాస్ ఎక్స్ ప్రెస్ 2: గోల్డెన్ మెటాలిక్ ఫ్రేమ్ తో చూడగానే ఆకర్షిస్తుంది. గొరిల్లా గ్లాస్ స్క్రీన్, ఫుల్ హెచ్ డీ వీడియోలు, మ్యూజిక్ ప్లేబాక్ ఆప్షన్లు ఉన్నాయి. 8 గిగాబైట్ల ఇంటర్నల్ మెమొరీ ఉండగా, పలు యాప్స్ ప్రీ లోడెడ్ గా లభిస్తున్నాయి. కెమెరా విషయంలో ఇతర ఫోన్ల కన్నా మెరుగైన చిత్రాలను అందిస్తుంది. స్వైప్ ఎలైట్: ఆఫీసు పనులు చేతి వేళ్లపై చక్కబెట్టుకోవాలని భావించే వారికి ఈ ఫోన్ ఉపకరిస్తుంది. ఫోన్ నంబర్లు మరింత వేగంగా డయల్ చేయడానికి, ఇటీవల వాడిన యాప్స్ ఓపెన్ చేయడానికి ప్రత్యేక సదుపాయాలు ఉన్నాయి. గెశ్చర్ రికగ్నిషన్, లాక్ స్క్రీన్, ఈ రేంజ్ ధరలో లభించే ఫోన్లలో అత్యధిక ఎంపీ కెమెరా ఈ స్మార్ట్ ఫోన్లో ఉన్నాయి.