: ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా... 20 గంటల 29 నిమిషాలే భేటీ


ఏపీ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కొద్దిసేపటి క్రితం అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కేవలం ఐదు రోజుల పాటు సమావేశమైన సభ 20 గంటల 29 నిమిషాలు మాత్రమే సాగింది. ఆద్యంతం విపక్షం విమర్శలు, అధికార పక్షం ప్రతిదాడి నేపథ్యంలో ఐదు రోజులూ సభలో రభసే నడిచింది. అంతేకాక ఏ ఒక్క అంశంపైనా కూడా పూర్తి స్థాయిలో చర్చ లేకుండానే అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ముగియడం విశేషం. ఐదు రోజుల పాటు జరిగిన సమావేశాల్లో భాగంగా మొన్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమావేశాలకు గైర్హాజరయ్యారు. తన తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని ఇడుపులపాయలో నివాళి అర్పించేందుకు వెళ్లిన జగన్ మొన్నటి సమావేశాలకు హాజరుకాలేదు. తాజాగా నేడు సీఎం నారా చంద్రబాబునాయుడు కూడా సమావేశాలకు రాలేదు. మెట్రో రైలు సలహాదారు శ్రీధరన్ తో పాటు పలువురు ప్రముఖులతో భేటీ నేపథ్యంలో చంద్రబాబు నేటి సమావేశాలకు గైర్హాజరయ్యారు.

  • Loading...

More Telugu News