: చిన్నప్పుడు నేను చాలా చిలిపివాడిని: విద్యార్థులతో ప్రణబ్


తాను చిన్నప్పుడు చాలా చిలిపి వాడినని, తన చేత అమ్మ బలవంతంగా పనిచేయించేదని చెబుతూ, ఆనాటి రోజులను రాష్ట్రపతి గుర్తు చేసుకున్నారు. ఈ ఉదయం 9 రాష్ట్రాలకు చెందిన 800 మంది విద్యార్థులకు ఆయన పాఠాలు చెప్పారు. తాను చదువుకున్న రోజుల్లో కిరోసిన్ తో వెలిగే దీపాలు మాత్రమే ఉండేవని, తాను వెనుకబడిన ప్రాంతం నుంచి వచ్చిన యావరేజ్ స్టూడెంట్ ను మాత్రమేనని ప్రణబ్ వివరించారు. నిత్యమూ పాఠశాలకు వెళ్లేందుకు 5 కి.మీ నడిచేవాడినని చెప్పుకొచ్చారు. పిల్లలకు దాదాపు గంట పాటు పొలిటికల్ సైన్స్ పాఠాలు చెప్పారు. భారత రాజ్యాంగం, దాన్ని రూపొందించిన తీరు గురించి వివరించారు.

  • Loading...

More Telugu News