: టీనేజ్ లవర్స్ కు ఆ నగరంలో నిబంధనలు... అతిక్రమిస్తే ఇక పెళ్లి చేసేస్తారు!
ప్రేమికులు కలసి తిరగడం సర్వసాధారణం. అలాగని వారిని ఫలానా టైమ్ లోనే కలుసుకోవాలి అని నిబంధనలు పెడితే బాగుంటుందా? కానీ, ఇప్పుడో దేశంలోని ఓ నగరం కుర్ర ప్రేమజంటలకు అలాంటి నిబంధనలు పెట్టింది. రాత్రిపూట ప్రేమికులు అస్సలు కలుసుకోకూడదని స్పష్టం చేసింది. ఒకవేళ నిబంధనలు అతిక్రమించి కలుసుకుంటే 'పెళ్లి చేసేస్తాం' అని హెచ్చరించింది. అయితే, ఈ నిబంధన 17 ఏళ్లలోపు వయస్సు వారికి మాత్రమే! తమ నగరంలో టీనేజ్ లవర్స్ వ్యవహారం ముదిరిపోవడంతో ఇండోనేషియాలోని పూర్వకర్త నగరం పాలకవర్గం ఈ నిర్ణయం తీసుకుంది. దాని ప్రకారం రాత్రి 9 గంటలు దాటిన తరువాత ఈ వయసు లవర్స్ కలుసుకోకూడదు. వారిపై నిత్యం గస్తీ దళాలు, సీసీ కెమెరాలతో నిఘా ఉంటుంది. నిబంధన ఉల్లంఘించిన వారికి విలేజ్ కల్చరల్ కౌన్సిల్ తో ముందుగా కౌన్సిలింగ్ ఇప్పిస్తారు. అయితే వరుసగా మూడుసార్లు నిబంధన అత్రికమిస్తే ప్రేమికులకు పెళ్లి చేయాలని తల్లిదండ్రుల కౌన్సిల్ సూచించింది. అక్టోబర్ 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది.