: బైకాల్ సరస్సుకు కార్చిచ్చు ముప్పు


ప్రపంచంలోనే సహజసిద్ధంగా ఏర్పడిన అతిపెద్ద మంచినీటి సరస్సు బైకాల్ కు ప్రమాదం ఏర్పడబోతోంది. రష్యా అడవుల్లో అంటుకున్న కార్చిచ్చు ఇందుకు ప్రధాన కారణం. ఇటీవల రష్యా అడవుల్లో రేగిన ఆ చిచ్చుతో వేల హెక్టార్ల అటవీ ప్రాంతం రోజూ బూడిదవుతోంది. రోజురోజుకూ అది మరింత ఎక్కువవుతోంది. రష్యా ప్రభుత్వం మాత్రం దానిని నియంత్రించేందుకు అలసత్వం వహిస్తూ కార్చిచ్చును ఆర్పేందుకు సరైన ప్రయత్నాలు చేయడంలేదు. దాంతో అక్కడి ప్రకృతిపై పెను ప్రభావాన్ని చూపిస్తోంది. కార్చిచ్చు వల్ల వెలువడుతున్న టాక్సిక్ వాయువులకు భయపడి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారట. మరికొంతమందైతే అనారోగ్యం బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో 10వేల మంది యువకులు, 2,500 మంది చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే బైకాల్ సరస్సును ఆధారంగా చేసుకుని జనావాసాలు ఏర్పడటమే కాకుండా, మంచి వన్యసంపద, మృగసంపద ఏర్పడింది. ఈ కార్చిచ్చు వల్ల ఆ సంపదకు ముప్పు వాటిల్లనుందని హెచ్చరికలు వస్తున్నాయి.

  • Loading...

More Telugu News