: తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలకు సోనియా అక్షింతలు
లోక్ సభలో తెలంగాణ కోసం రగడ చేస్తున్న కాంగ్రెస్ ఎంపీలపై సోనియా ఆగ్రహించారు. వెంటనే తెలంగాణ బిల్లును సభలో పెట్టాలంటూ తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు నిన్నటిలానే ఈ రోజు కూడా సభలో నినాదాలు చేశారు. దీంతో సంయమనం పాటించాలని, మెదలకుండా కూర్చోవాలని సోనియా కాస్త గట్టిగానే ఎంపీలకు సూచించారు. అమ్మ ఆగ్రహంతో ఎందుకొచ్చిన తంటా అనుకున్న ఎంపీలు మెల్లగా స్వరం తగ్గించి తమ ఆసనాలలో కూర్చుండిపోయారు.