: పంచె కట్టినంత మాత్రాన పోచారం రైతు అయిపోతాడా?: జీవన్ రెడ్డి


టీఎస్ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మేల్యే జీవన్ రెడ్డి సెటైర్లు విసిరారు. పంచెకట్టినంత మాత్రాన పోచారం రైతు అయిపోతాడా? అని ఎద్దేవా చేశారు. తన ప్రతిష్ట మసకబారిపోతుందనే ఆలోచనతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ కరవు మండలాలను ప్రకటించడం లేదని మండిపడ్డారు. రైతులు నాశనం అవుతున్నా టీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టడంలేదని విమర్శించారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1700 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. బంగారు తెలంగాణ తెస్తానంటూ... ఆత్మహత్యల తెలంగాణ తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ దే అని మండిపడ్డారు. కరీంనగర్ జిల్లా సార్తవాయి గ్రామంలో ఇటీవలే ఆత్మహత్యకు పాల్పడ్డ రైతు గంగరాజం కుటుంబాన్ని ఆయన ఈ రోజు పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, పైవ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News