: మత్తయ్యకు ఎందుకు ఆశ్రయమిచ్చారు?... చంద్రబాబు సర్కారుకు రోజా ప్రశ్న


ఓటుకు నోటు కేసు ఏపీకి సంబంధించినది కాదని చెబుతున్న టీడీపీ నేతలు, ఈ కేసులో కీలక నిందితుడైన జెరూసలెం మత్తయ్యకు ఎందుకు ఆశ్రయమిచ్చారని వైసీపీ ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆమె టీడీపీ నేతల వైఖరిపై నిప్పులు చెరిగారు. కేసులో కీలక నిందితుడిగా ఉన్న మత్తయ్యకు ఏపీలోని విజయవాడలో టీడీపీ నేతలు ఆశ్రయమిచ్చిన మాట వాస్తవం కాదా? అని ఆమె నిలదీశారు. ఓటుకు నోటు కేసు, తెలంగాణ సర్కారు చేసిన ఫోన్ ట్యాపింగ్ లపై వరుసగా పోలీసు బాసులను ఇంటికి పిలిపించుకుని మాట్లాడిన ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, రాష్ట్రంలో కలకలం సృష్టించిన రిషితేశ్వరి, తహశీల్దార్ వనజాక్షి ఘటనలకు సంబంధించి ఎందుకు సమీక్షించలేదని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News