: ముస్లిం జనాభా పెరుగుదలను నియంత్రించాలి: వీహెచ్ పీ అధినేత తొగాడియా
భారత్ లో హిందువుల జనాభా తగ్గుతోందని, ముస్లింల జనాభా పెరుగుతోందన్న గణాంకాలు వెల్లడైన నేపథ్యంలో విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్ పీ) అధినేత ప్రవీణ్ తొగాడియా సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లింల జనాభా పెరుగుదలకు కళ్లెం వేయాలని ఆయన అన్నారు. ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది పిల్లలను కనే ముస్లింలను శిక్షించాలని చెప్పారు. 'జనాభా జీహాద్' అనే కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ మాట్లాడుతూ, ముస్లింల జనాభా పెరుగుతున్నందున, వారిని మైనారిటీల జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.