: ఆస్తులు అమ్మించి డబ్బులిప్పిస్తా: అగ్రిగోల్డ్ బాధితులకు చంద్రబాబు బాసట


అగ్రిగోల్డ్ సంస్థలో పెట్టుబడులు పెట్టి తీవ్రంగా నష్టపోయిన బాధితులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బాసటగా నిలిచారు. బాధితులకు రావాల్సిన బకాయిలు ఇప్పించే బాధ్యత తనదేనని ఆయన అన్నారు. ఈ ఉదయం కొందరు బాధితులు అసెంబ్లీకి వచ్చి, తమ గోడును ఆయన ముందు వెళ్లబోసుకున్నారు. ఆ సంస్థ ఆస్తులను విక్రయించి డబ్బులు ఇప్పిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. డబ్బు గురించిన దిగులు వద్దని, ఎవరికీ అన్యాయం జరగనివ్వబోమని ఆయన అన్నారు. కోర్టు ఆదేశాల మేరకు నడుచుకుంటామని బాధితులకు తెలిపారు.

  • Loading...

More Telugu News