: టీడీపీ నేతలు కాకుల్లా గగ్గోలు పెడుతున్నారు: రోజా


ఓటుకు నోటు కేసుపై శాసనసభలో తాము వాయిదా తీర్మానం ఇస్తే టీడీపీ ఉలిక్కిపడుతోందని వైకాపా ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. ఈ తీర్మానంపై టీడీపీ ఎమ్మెల్యేలు షాక్ తిన్న కాకుల్లా గగ్గోలు పెడుతున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ రోజా ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఓటుకు నోటు కేసు కోర్టులో ఉన్నందున దీనిపై చర్చకు అనుమతించనని స్పీకర్ చెప్పడాన్ని ఆమె తప్పుబట్టారు. జగన్ కేసులపై టీడీపీ నేతలు రోజూ మాట్లాడుతున్నా స్పీకర్ మౌనంగా ఉండటం ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఆరోపించారు. పట్టిసీమ ప్రాజెక్టులో దోచుకున్న డబ్బుతో తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనడానికి టీడీపీ యత్నించిందని విమర్శించారు. ఆడియోలో ఉన్న స్వరం చంద్రబాబుదా? కాదా? అనే విషయాన్ని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కేసు నుంచి బయటపడే మార్గాలను అన్వేషించేందుకు ఇప్పటివరకు డీజీపీతో చంద్రబాబు 15 సార్లు సమావేశమయ్యారని అన్నారు.

  • Loading...

More Telugu News