: అసెంబ్లీకి వచ్చిన అగ్రిగోల్డ్ బాధితులు.. మరికాసేపట్లో చంద్రబాబుతో భేటీ


అగ్రిగోల్డ్ నయా మోసంతో సర్వస్వం కోల్పోయిన తమకు ప్రభుత్వం సహాయం చేస్తే తప్పించి మరో దారి లేదని వారంతా నిర్ధారించుకున్నారు. ఇప్పటికే విజయవాడకు వచ్చిన ప్రతి రాజకీయ నాయకుడితో పాటు పోలీసు అధికారులను వరుసపెట్టి కలిశారు. తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిని కూడా బాధితులు విజయవాడలో గతంలోనే కలిశారు. ఈ సందర్భంగా న్యాయం చేస్తామని చంద్రబాబు వారికి హామీ ఇచ్చారు. విచారణకు ఆదేశాలు జారీ చేయడంతో పాటు ప్రత్యేకంగా కమిటీని కూడా చంద్రబాబు వేశారు. అగ్రిగోల్డ్ ఆస్తులను అమ్మి వెంటనే బాధితులకు డిపాజిట్లు చెల్లంచాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. తాజాగా నేటి ఉదయం హైదరాబాదుకు వచ్చిన బాధితులు కొద్దిసేపటి క్రితం ఏపీ అసెంబ్లీకి వచ్చారు. తమకు సాధ్యమైనంత త్వరగా న్యాయం చేయాలని వారు చంద్రబాబును కోరనున్నారు. ఈ మేరకు మరికాసేపట్లో చంద్రబాబుతో వారు భేటీ కానున్నారు.

  • Loading...

More Telugu News