: వాయిదా తీర్మానాల తిరస్కరణ... పోడియం చుట్టుముట్టిన వైసీపీ
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో గడచిన నాలుగు రోజులు చోటుచేసుకున్న పరిణామాలే చివరి రోజునా పునరావృతమయ్యాయి. ఓటుకు నోటు, పెరిగిన ధరలపై చర్చకు అనుమతించాలంటూ ప్రతిపక్షం వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ కోడెల శివప్రసాద్ తిరస్కరించారు. దీంతో నిరసన వ్యక్తం చేసిన విపక్షం స్పీకర్ పోడియంను చుట్టుముట్టింది. చర్చకు అనుమతించాల్సిందేనని పెద్ద పెట్టున నినాదాలు చేసింది. దీంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రశ్నోత్తరాలకు అంతరాయం కలిగింది.