: వార్తల వారధి ట్విట్టర్...న్యూస్ కోసం ప్రతి 10 మందిలో 9 మంది యూజర్లది ట్విట్టర్ బాటే!


వార్తలు తెలుసుకునేందుకు సోషల్ మీడియా యూజర్లు ఎక్కువగా ట్విట్టర్ నే ఫాలో అవుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ విషయంలో ఈ తరహా ఫాలోయింగ్ ట్విట్టర్ కు మరింత ఎక్కువగా ఉంటోందట. ఈ మేరకు అమెరికాకు చెందిన ఓ యూనివర్సిటీ నిపుణులు తాజాగా నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ప్రతి 10 మంది యూజర్లలో 9 మంది వార్తల కోసం ట్విట్టర్ నే ఆశ్రయిస్తున్నారని ఆ సర్వే తేల్చింది. అంటే దాదాపుగా 86 శాతం మంది సోషల్ మీడియా యూజర్లు వార్తలు తెలుసుకునేందుకు ట్విట్టర్ పైనే ఆధారపడుతున్నారు. మిగితా సోషల్ మీడియా యూజర్లను అలా పక్కనబెడితే, ట్విట్టర్ ఖాతా ఉన్న వారిలో మెజారిటీ శాతం మంది న్యూస్ ఏజెన్సీలను వాటి ట్విట్టర్ ఖాతాల ద్వారా ఫాలో అవుతున్నారని కూడా ఆ సర్వే తేల్చింది. ఇక మూడు శాతం మంది ట్విట్టర్ వినియోగదారులు ట్విట్టర్ లోని జర్నలిస్టులు, రచయితలను ఫాలో అవుతున్నారని కూడా ఈ సర్వే చెప్పింది.

  • Loading...

More Telugu News