: హఫీజ్ సయీద్ కు ఝలకిచ్చిన లాహోర్ హైకోర్టు


నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా అధినేత హఫీజ్ సయీద్ కు లాహోర్ హైకోర్టు ఝలకిచ్చింది. భారతీయ సినిమాలు పాకిస్థాన్ లో విడుదల కాకుండా నిషేధించాలంటూ దాఖలు చేసిన పిటిషన్ ను పాకిస్థాన్ న్యాయస్థానం కొట్టివేసింది. భారతీయ సినిమాలు పాకిస్థాన్ లో విడుదల కాకుండా పూర్తిగా నిషేధించాలని కోరుతూ ముంబై పేలుళ్ల సూత్రధారి, తీవ్రవాద సంస్థ నాయకుడు హఫీజ్ సయీద్ లాహోర్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిని విచారించిన న్యాయస్థానం హఫీజ్ సయీద్ న్యాయవాది అభ్యర్థనను తిరస్కరించింది. పాకిస్థాన్ సంస్కృతిక శాఖను సంప్రదించాలని సూచించింది. కాగా, సరిహద్దుల్లో కాల్పులు జరుగుతున్న నేపథ్యంలో భారతీయ సినిమాలు నిషేధించాలని హఫీజ్ సయీద్ న్యాయవాది న్యాయస్థానానికి విన్నవించారు. కాగా, గతంలో ఇదే న్యాయస్థానంలో సైఫ్ అలీ ఖాన్ నటించిన 'ఫాంటమ్' సినిమాను నిషేధించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News