: దొంగగారికి 'పంచ్'లన్నీ ఇచ్చేసిన మహిళ!


ఒక్కోసారి మనం ఒకటనుకుంటే, మరొకటి జరుగుతుంటుంది. ఈ దొంగగారి వ్యవహారం కూడా అలాంటిదే. ఓ మహిళను దోచుకుందామని ప్రయత్నిస్తే అసలుకే మోసం జరిగింది. ఆ వివరాల్లోకి వెళ్తే...బ్రెజిల్ లోని బ్రస్సెల్స్ లో ఓ దొంగ అటుగా బైక్ పై వెళుతున్న ఓ మహిళను అటకాయించి, తన దగ్గరున్నవన్నీ ఇచ్చేయాలని బెదిరించాడు. దీంతో బైక్ దిగిన యువతి 'అన్నీ ఇచ్చేయాల్సిందేనా?' అంటూ అడిగింది. 'ఇచ్చేయాల్సిందే' అంటూ దొంగగారు కరాఖండీగా చెప్పడంతో, తన దగ్గరున్న 'పంచ్'లన్నీ వరుసగా ఇచ్చేసింది. మార్షల్ ఆర్ట్స్ లో నిష్ణాతులైన వారు ప్రదర్శించే 'జియు-జిట్సు' అనే మూవ్ తో తాడులేకుండా దొంగను బంధించేసి, 'లయన్ కిల్లర్ చోక్'తో కాళ్ల మధ్య ఇరికించుకుంది. దీంతో దొంగ 'కుయ్యో మొర్రో' అనడం, అంతలోనే ఆమె పోలీసులను పిలిచి దొంగను అప్పగించడం జరిగిపోయాయి. పోలీసులు వచ్చి ఆమెను 'మిస్ బాస్టోస్'గా గుర్తించారు. ఆమెకు మార్షల్ ఆర్ట్స్ లోని ఎంఎంఎం ఫైట్స్ లో ఆరు రికార్డులున్నాయి. అలాంటి ఫైటర్ తో పెట్టుకుని దొంగగారు అలా బుక్కయ్యిపోయారు.

  • Loading...

More Telugu News