: బిగ్ బాస్ సీజన్ 9లో శ్వేత బసు ప్రసాద్?


బిగ్ బాస్ సీజన్ 9లో ప్రముఖ నటి శ్వేత బసు ప్రసాద్ పాల్గోనుందా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. ఈ వివాదాస్పద రియాలిటీ షోలో ఇప్పటికే పలువురు సెలెబ్రిటీలు పాల్గొనడం... సంచలనాలు కావడం మనకు తెలిసిందే. గతంలో సినీ నటి మోనికా బేడి, వివాదాస్పద కార్టూన్ తో జైలు పాలైన జర్నలిస్టు అసీమ్ త్రివేదీ తదితరులు పాల్గొన్న సంగతి తెలిసిందే. తాజాగా వ్యభిచారం కేసులో ఇరుక్కుని అరెస్టైన నటి శ్వేత బసు ప్రసాద్ 'బిగ్ బాస్ 9'లో పాల్గొని, తనపై పడిన ముద్ర చెరిపేసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. శ్వేత బిగ్ బాస్ లో పాల్గొంటే దక్షిణాదిలో కూడా ఆ షో ఆదరణ పొందుతుందని నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారు. గత 8 సంవత్సరాలుగా అలరిస్తోన్న బిగ్ బాస్ రియాలిటీ షో 9వ సీజన్ కు సిద్ధమవుతోంది. సుమారు వంద రోజులుగా నడిచే ఈ షో క్రిస్ మస్ లేదా కొత్త సంవత్సరంతో ముగుస్తుంది. గతంలో ఈ షోకు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, సంజయ్ దత్, అర్షాద్ వార్సి తదితరులు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. తాజా 9వ సీజన్ కు సల్మాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడని సమాచారం.

  • Loading...

More Telugu News