: అవన్నీ పుకార్లు...నేను రేసులో లేను: బాలీవుడ్ నటుడు ఉదయ్ చోప్రా


క్రిస్ మస్ సీజన్ ప్రారంభమవుతోంది. గత 8 సంవత్సరాలుగా బిగ్ బాస్ రియాలిటీ షో ఈ సీజన్ లో బాలీవుడ్ అభిమానులను అలరిస్తోంది. దీంతో తాజాగా 9వ సీజన్ కు బిగ్ బాస్ సిద్ధమవుతోంది. సుమారు వంద రోజులుగా నడిచే ఈ షో క్రిస్ మస్ లేదా కొత్త సంవత్సరంతో ముగుస్తుంది. ఈ షోకు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. అయితే, ఈ షోలో బాలీవుడ్ ప్రముఖ నిర్మాత యశ్ చోప్రా కుమారుడు ఉదయ్ చోప్రా పాల్గోనున్నాడని వార్తలు వెలువడ్డాయి. దీంతో తానీ షోలో పాల్గోవడం లేదని, అవన్నీ పుకార్లని ఉదయ్ చోప్రా వివరణ ఇచ్చాడు. అంత గొప్ప షోలో పాల్గొనేందుకు తాను అర్హుడిని కాదంటూ ఉదయ్ పేర్కోవడం విశేషం.

  • Loading...

More Telugu News