: నాజీల కంటే కిరాతకులు వాళ్లు: ఆస్ట్రేలియా ప్రధాని


ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు నాజీల కంటే కూడా అత్యంత కిరాతకులని ఆస్ట్రేలియా ప్రధాని నరేంద్ర మోదీ టోనీ అబ్బాట్ వ్యాఖ్యానించారు. వారు నాజీల కంటే కూడా భయంకరమైన వారని ఆయన తెలిపారు. ఇరాక్, సిరియాలలో వారి ఆగడాలు వర్ణించేందుకు మాటలు చాలవని ఆయన పేర్కొన్నారు. గతంలో నాజీలు కూడా క్రూరమైన చర్యలకు పాల్పడ్డారు కానీ, ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు వారికంటే భయంకరమైన రీతిలో దారుణాలకు పాల్పడుతున్నారని ఆయన వెల్లడించారు. కాగా, సిరియా, ఇరాక్ లలో వైమానిక దాడులకు అమెరికాకు ఆస్ట్రేలియా సహకరిస్తోంది. కాగా, గత కొంత కాలంగా ఐఎస్ఐఎస్ చేస్తున్న హత్యలు ఒళ్లు గగుర్పొడుస్తాయనడంలో అతిశయోక్తి లేదు.

  • Loading...

More Telugu News